నమస్కారం! భారతీయ సనాతన ధర్మం మరియు శాస్త్రీయ సంగీతంలో "తెలుగు భక్తి గీతాలు" తప్ప పరభాషలలో దాగి ఉన్న భక్తి గీతాలను" మాత్రమే సమాజానికి అందించాలనే లక్ష్యంతో ఈ blog ప్రారంభించబడింది.
ముఖ్యంగా జయదేవుని అష్టపదులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కీర్తనలు మరియు భక్తి సాహిత్యాన్ని తెలుగులో స్పష్టమైన అనువాదంతో (Translation) ఇక్కడ పొందుపరుస్తున్నాము.
మా బ్లాగ్ ప్రత్యేకతలు:
- సాహిత్య పారదర్శకత: భక్తి గీతాల అసలు అర్థం దెబ్బతినకుండా సరళమైన తెలుగులో అనువాదాలు.
- అర్థం మరియు వివరణ: కీర్తనలు (భక్తి గీతాలు) అవి ఏ భాషలో ఉన్నా (No language barriers) తెలుగు లిపి మరియు అనువాదం లో ఉంటాయి. తెలుగు కీర్తనలు కూడా అర్థం కాకపోతే (ఉదాహరణకు అన్నమయ్య వారి చూడరమ్మ సతులాల) వాటికి అర్థం మరియు వివరణ ఇవ్వడం జరుగుతుంది.
మీరు కర్ణాటక సంగీత ప్రియులైనా లేదా ఆధ్యాత్మిక అన్వేషకులైనా.. మీకు మా ఈ చిరు ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు విమర్శలూ ఎప్పుడూ ఆహ్వానించబడతాయి.
మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు విమర్శలూ ఎప్పుడూ ఆహ్వానించబడతాయి.

Post a Comment
ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి