#12 నాథ హరే/పశ్యతి దిశి దిశి - శ్రీ భక్త జయదేవ్ వారి అష్టపదులు | Lyrics in English & Telugu Translations

శ్రీ జయదేవుని అష్టపదులలో పన్నెండవ అష్టపది - నాథ హరే/పశ్యతి దిశి దిశి తెలుగులో సాహిత్యం అనువాదాలు English Transliteration and Translations కోసం - అడవిలోని చిమ్మచీకట్లలో  రాధాకృష్ణుల మనోహర చిత్రం.

  • షష్ఠః సర్గః - సోత్కంఠ వైకుంఠః
  • జయదేవ అష్టపది ప్రబంధః - 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్
  • భక్త జయదేవ్ వారి అష్టపదులలో 12వ
  • అష్టపది: నాథ హరే/పశ్యతి దిశి దిశి
  • రాగం: శంకరాభరణం
  • Aa:S R2 G3 M1 P D2 N3 S
  • Av: S N3 D2 P M1 G3 R2 S
  • తాళం: త్రిపుట
  • రచయిత: భక్త జయదేవ
  • భాష: సంస్కృతం
  • ఆరాధ్య దైవం: శ్రీ కృష్ణ



భక్తి  గీతం సారాంశం (భక్తి గీతం గురించి) Song Summary

శ్రీ భక్త జయదేవ మహాకవి
యశస్సును విశ్వవ్యాప్తం చేసిన గీత గోవిందం లోని 
షష్ఠః సర్గః - సోత్కంఠ వైకుంఠః కి చెందిన జయదేవ అష్టపది ప్రబంధః - 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్ (పల్లవి: 
నాథ హరే/పశ్యతి దిశి దిశి) విశేషాలు ఇక్కడ అందించబడ్డాయి.

శ్రీకృష్ణుడి విరహంలో బాధపడుతున్న రాధ స్థితిని ఆమె చెలికత్తె కృష్ణుడికి వివరించే సందర్భంలోనిదీ ఈ అద్భుతమైన గీతం.


భక్త జయదేవ్ వారి అష్టపదులలో పన్నెండవ అష్టపది 

నాథ హరే/పశ్యతి దిశి దిశి సాహిత్యం



 
ధ్యాన శ్లోకం
అథ తాం గంతు మశక్తాం, చిర మనురక్తాం, లతా గృహే దృష్ట్వా |
తచ్చరితం గోవిందే, మనసిజ మందే సఖీ ప్రాహ ||                                         ||అథ తాం గంతు||

పల్లవి
పశ్యతి దిశి దిశి రహసి భవంతమ్ |
త్వదధర మధుర మధుని పిబంతమ్ ||
నాథ హరే సీదతి రాధా వాసగృహే || ధ్రువపదం ||                                                  ||నాథ హరే||

అనుపల్లవి
త్వదభిసార రభసేన వలంతీ |
పతతి పదాని కియంతి చలంతీ ||                                                                            ||నాథ హరే||

చరణం 1 
విహిత విశద బిస కిసలయ వలయా |
జీవతి పరమిహ తవ రతి కలయా ||                                                           ||నాథ హరే||

చరణం 2 
ముహురవలోకిత మాన లీలా |
మధురిపురహమితి భావన శీలా ||                                                                          ||నాథ హరే||

చరణం 3
త్వరితముపైతి న కథమభిసారమ్ |
హరిరితి వదతి సఖీమనువారమ్ ||                                                                          ||నాథ హరే||

చరణం 4 
శ్లిష్యతి చుంబతి జలధర కల్పమ్ |
హరిరుపగత ఇతి తిమిరమనల్పమ్ ||                                                                       ||నాథ హరే||

చరణం 5 
భవతి విలంబిని విగళిత లజ్జా |
విలపతి రోదితి వాసక సజ్జా ||                                                                  ||నాథ హరే||

చరణం 6
శ్రీ జయదేవ కవేరిదముదితమ్ |
రసిక జన తనూతామతిముదితమ్ ||                                                         ||నాథ హరే||
      



భక్త జయదేవ్ వారి అష్టపదులలో పన్నెండవ అష్టపది

నాథ హరే/పశ్యతి దిశి దిశి తెలుగు అనువాదం
  


ధ్యాన శ్లోకం
అథ తాం గంతు మశక్తాం, చిర మనురక్తాం, లతా గృహే దృష్ట్వా |
తచ్చరితం గోవిందే, మనసిజ మందే సఖీ ప్రాహ ||
తెలుగు అనువాదం
రాధ ఒక పూల పొదరింట్లో కూర్చుని ఉంది. కృష్ణుడిని కలవాలనే ఆరాటం
ఆమె మనసులో ఎంతగానో ఉన్నా, శరీరం ఏమాత్రం సహకరించని
బలహీన స్థితిలో ఉంది. రాధ పడుతున్న ఈ బాధను చూసిన
ఒక చెలికత్తె, ఆమె దీనస్థితిని శ్రీకృష్ణుడికి వివరించింది.

పల్లవి
పశ్యతి దిశి దిశి రహసి భవంతమ్ |
త్వదధర మధుర మధుని పిబంతమ్ ||
నాథ హరే సీదతి రాధా వాసగృహే || ధ్రువపదం ||
తెలుగు అనువాదం
ఓ హరీ! నీవే ఆమెకు ఏకైక దిక్కు. నీ రాక కోసం ఎదురుచూస్తున్న ఆ కలయిక స్థలంలో
రాధ విరహ బాధతో నలిగిపోతోంది. తన పెదవుల తియ్యదనాన్ని
ఆస్వాదించడంలో నేర్పరివైన నిన్నే... ఆమె తన మనసులోనూ,
చుట్టూ ఉన్న ప్రతి దిక్కులోనూ చూసుకుంటోంది.

అనుపల్లవి
త్వదభిసార రభసేన వలంతీ |
పతతి పదాని కియంతి చలంతీ ||
తెలుగు అనువాదం
నిన్ను కలుసుకోవాలనే ఆరాటంతో, నీ దగ్గరకు త్వరగా చేరుకోవాలనే
వేగంతో ఆమె అడుగులు వేస్తోంది. కానీ ఆ తొందరలో అడుగులు
తడబడుతున్నాయి. కొన్ని అడుగులు వేయగానే
నిలబడలేక కింద పడిపోతోంది.

చరణం 1 
విహిత విశద బిస కిసలయ వలయా |
జీవతి పరమిహ తవ రతి కలయా ||
తెలుగు అనువాదం
ఆమె స్వచ్ఛమైన తెల్ల తామర కాడలను, లేత చిగురుటాకులను గాజులుగా,
మొలనూలుగా, ఉంగరాలుగా, భుజకీర్తులుగా మరియు దండలుగా
ధరిస్తోంది. కేవలం నిన్ను కలుసుకుంటాననే ఆ చిన్న ఆశతోనే
ఆమె ఇంకా ప్రాణాలు నిలుపుకుని ఉంది.

చరణం 2 
ముహురవలోకిత మాన లీలా |
మధురిపురహమితి భావన శీలా ||
తెలుగు అనువాదం
ఓ కృష్ణా! తన ప్రాణం నీ ప్రాణంలో కలిసిపోయింది.
ఆ తన్మయత్వంలో తనే 'కృష్ణుడినని' ఊహించుకుంటూ,
నీలాగే మారిపోయి తన అలంకారాలను
తానే పదే పదే చూసుకుంటోంది.

చరణం 3 

త్వరితముపైతి న కథమభిసారమ్ |
హరిరితి వదతి సఖీమనువారమ్ ||
తెలుగు అనువాదం
"శ్రీకృష్ణుడు నా దగ్గరకు ఎందుకు త్వరగా రావడం లేదు?"
అని ఆమె నన్ను(చెలికత్తే) పదే పదే అడుగుతోంది.

చరణం 4 
శ్లిష్యతి చుంబతి జలధర కల్పమ్ |
హరిరుపగత ఇతి తిమిరమనల్పమ్ ||
తెలుగు అనువాదం
చుట్టూ చీకటి కమ్ముకుని ఉండగా, ఆ నల్లటి చీకటిని మేఘాన్ని 
చూసి దానినే కృష్ణుడి రూపమని అనుకుని.. 'కృష్ణుడు వచ్చాడు!'
అని అనుకుంటూ, ఆ చీకటినే ఆలింగనం
చేసుకుంటూ ముద్దుపెట్టుకుంటోంది.

చరణం 5 
భవతి విలంబిని విగళిత లజ్జా |
విలపతి రోదితి వాసక సజ్జా ||
తెలుగు అనువాదం
లోకజ్ఞానంలోకి వచ్చిన రాధ.. నువ్వు ఇంకా రాలేదని తెలుసుకున్న
మరుక్షణమే, తన సిగ్గును కూడా మరిచిపోయి
గట్టిగా ఏడుస్తోంది.

చరణం 6
శ్రీ జయదేవ కవేరిదముదితమ్ |
రసిక జన తనూతామతిముదితమ్ ||
తెలుగు అనువాదం
జయదేవుడు రాసిన ఈ కావ్యం, రసాన్ని ఆస్వాదించగల చదువురుల
మనసుల్లో ఎంతో సంతోషాన్ని,
ఆనందాన్ని నింపుగాక!


Bhakta Jayadeva's Ashtapadis twelfth Ashtapadi

nātha harē/paśyati diśi diśi Lyrics Transliteration



Meditative Verses
atha tāṁ gaṁtu maśaktāṁ, cira manuraktāṁ, latā gr̥hē dr̥ṣṭvā |
taccaritaṁ gōviṁdē, manasija maṁdē sakhī prāha ||                     ||atha tāṁ gaṁtu||

Pallavi
paśyati diśi diśi rahasi bhavaṁtam |
tvadadhara madhura madhuni pibaṁtam ||
nātha harē sīdati rādhā vāsagr̥hē ||Refrain||                                           ||nātha harē||

Verse 1 
tvadabhisāra rabhasēna valaṁtī |
patati padāni kiyaṁti calaṁtī ||                                                                ||nātha harē||

Verse 2
vihita viśada bisa kisalaya valayā |
jīvati paramiha tava rati kalayā ||                                                             ||nātha harē||

Verse 3 
muhuravalōkita māna līlā |
madhuripurahamiti bhāvana śīlā ||                                                          ||nātha harē||

Verse 4 
tvaritamupaiti na kathamabhisāram |
haririti vadati sakhīmanuvāram ||                                                            ||nātha harē||

Verse 5 
śliṣyati cuṁbati jaladhara kalpam |
harirupagata iti timiramanalpam ||                                                           ||nātha harē||

Verse 6 
bhavati vilaṁbini vigaḷita lajjā |
vilapati rōditi vāsaka sajjā ||                                                                     ||nātha harē||

Verse 7 
śrī jayadēva kavēridamuditam |
rasika jana tanūtāmatimuditam ||                                                            ||nātha harē||

 

 

Bhakta Jayadeva's Ashtapadis twelfth Ashtapadi

nātha harē/paśyati diśi diśi English Translation




Meditative Verses
atha tāṁ gaṁtu maśaktāṁ, cira manuraktāṁ, latā gr̥hē dr̥ṣṭvā |
taccaritaṁ gōviṁdē, manasija maṁdē sakhī prāha || 
English Translation
Radha was seated in a floral bower.
Though her heart desperately longed to meet Krishna,
her body was too frail to support her.
Witnessing her distress, a companion
described her plight to Sri Krishna.

Pallavi
paśyati diśi diśi rahasi bhavaṁtam |
tvadadhara madhura madhuni pibaṁtam ||
nātha harē sīdati rādhā vāsagr̥hē ||Refrain||
English Translation
O Hari! You are her only refuge. Waiting for your arrival
at the place of rendezvous, Radha is languishing
in the deep agony of separation.
She beholds only you—the master at savoring
the sweetness of her lips—within her heart and in
every direction around her.

Verse 1 
tvadabhisāra rabhasēna valaṁtī |
patati padāni kiyaṁti calaṁtī ||
English Translation
In her deep yearning to meet you, she moves swiftly
to reach your side quickly. But in her haste,
her steps falter; after taking just a few steps,
unable to hold herself up, she collapses to the ground.

Verse 2 
vihita viśada bisa kisalaya valayā |
jīvati paramiha tava rati kalayā || 
English Translation
She adorns herself with pristine white lotus stalks
and tender young leaves, wearing them as bangles,
waistbands, rings, armlets, and garlands.
She clings to life solely on the slender hope of meeting you.

Verse 3
muhuravalōkita māna līlā |
madhuripurahamiti bhāvana śīlā || 
English Translation
O Krishna! Her very life force has merged with yours.
In that state of deep ecstasy, imagining herself
to be 'Krishna', she feels transformed into
you and repeatedly admires her own adornments.

Verse 4 
tvaritamupaiti na kathamabhisāram |
haririti vadati sakhīmanuvāram || 
English Translation
'Why is Lord Krishna not coming to me quickly?'
she repeatedly asks me, her companion.

Verse 5
śliṣyati cuṁbati jaladhara kalpam |
harirupagata iti timiramanalpam || 
English Translation
As darkness surrounds her, she looks at a dark cloud
and mistakes it for Krishna. Thinking, "Krishna has come!"
she embraces and kisses the darkness.

Verse 6 
bhavati vilaṁbini vigaḷita lajjā |
vilapati rōditi vāsaka sajjā || 
English Translation
The moment Radha comes back to her
senses and realizes that you still have not arrived,
she forgets even her modesty and weeps aloud.

Verse 7 
śrī jayadēva kavēridamuditam |
rasika jana tanūtāmatimuditam || 
English Translation
May this poetic work composed by Jayadeva
fill the hearts of readers who savor its aesthetic
essence with immense joy and bliss!







 


0 Comments

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment (0)

Previous Post Next Post